కరోనా వైరస్ తో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు పోరాటం చేస్తుంటే వారికి బారి విరాళాన్ని అందిస్తూ తమ వంతు కొంతమంది పారిశ్రామిక వేత్తలు, సినిమా పరిశ్రమకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ముందు వరుసలో నిల్చున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ టాప్ హీరో ప్రభాస్ ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి తన పెద్ద మనస్సును చాటుకున్నాడు.

ఇక ఇప్పుడు కరోనా వైరస్ వలన చితికిపోతున్న సినిమా కార్మికుల కోసం మరొక 50 లక్షలు ప్రకటించి వారి మన్ననలను చూరగొన్నాడు. హీరో చిరంజీవి ఆధ్వర్యంలో నడుస్తున్న కరోనా క్రైసిస్ చారిటీ(CCC)కి ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఇప్పటికే అల్లు అర్జున్, నితిన్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, దిల్ రాజు ఇలా పలువురు నటులు ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ వారికి తోచిన సహాయం చేసి కరోనా వైరస్ పారద్రోలడానికి తమ వంతు సహాయాన్ని అందిస్తుండటం మెచ్చుకోదగ్గ విషయం