‘ఈశ్వర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ప్రభాస్. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా 2002 వ సంవత్సరంలో విడుదలయ్యింది. అయితే మొదట ఆ సినిమాకు ప్రభాస్ ను కాకుండా ఇంకా రకరకాల హీరోలను అనుకున్నారట. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో అశోక్ కుమార్ ఓ సినిమా చేద్దామని అనుకుంటున్నాడట. స్టోరీ కూడా రెడీ అవడంతో హీరో కోసం తరుణ్ ను సంప్రదించారట. అయితే తరుణ్ ఓకే చేశారట. కానీ సినిమా చేసే విషయంలో తరుణ్ క్లారిటీ ఇవ్వకపోవడంతో అశోక్ కుమార్ తన కొడుకునే హీరోగా పరిచయ చేద్దాం అనుకున్నారు. అప్పుడు అశోక్ కుమార్ కొడుకు చదువు పూర్తి కాకపోవడంతో ఒప్పుకోలేదట.

ఇక అల్లు అర్జున్ కూడా హీరోగా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలిసి తన ఫోటోలను నిర్మాత అశోక్ కుమార్ తెప్పించుకున్నారు. కానీ అశోక్ కుమార్ కి అల్లు అర్జున్ అంతగా నచ్చలేదు. ఇక సినిమా పెద్దలందరిని కూర్చోబెట్టి తాను అనుకున్న కథకి ఎవరైతే బాగుంటుందని చెబితే వారందరు ప్రభాస్ పేరు చెప్పారట. అసలు ప్రభాస్ కి చిన్నప్పటి నుండి నటించాలని ఆసక్తి లేదట. ఏదైనా వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ చెయ్యాలని ఉండేదట. కానీ చదువు పూర్తయినాక తన పెదనాన్న కృష్ణంరాజు కి హీరో అవుతానని సడెన్ గా చెప్పడంతో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ షాక్ కి గురయ్యారట.

నటించాలని ఉంటే ముందు నటనలో శిక్షణ తీసుకోవాలని విశాఖలోని సత్యానంద్ గారి దగ్గరకు ప్రభాస్ ను పంపారు కృష్ణంరాజు. శిక్షణలో ఇంకా ఓనమాలు కూడా దిద్దకుండానే మధ్యలోనే అశోక్ కుమార్.. ప్రభాస్ ను సంప్రదించడంతో ‘ఈశ్వర్’ సినిమా తెరమీదకు వచ్చింది. అలా ఈశ్వర్ తో ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. అలా ఈశ్వర్ సినిమాతో నటనలో ఒకో మొట్టుగా ఎదుగుతూ వచ్చిన ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొంది తెలుగు సినిమాను శాసించే స్థాయికి ఎదిగాడు.