‘సాహో’ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘జాన్’. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యూరప్ తో పాటు హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. 1970 కాలంతో పాటు యూరప్ లో సాగే ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ చివరి వారం నుండి హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ యూరోప్ వెళ్లనున్నారు చిత్ర యూనిట్.

జగపతి బాబు విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గత మూడు సంవత్సరాల నుండి తీసిన ‘సాహో’ సినిమా నిరాశపరిచిన నేపథ్యంలో ఈ ‘జాన్’ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి వచ్చే వేసవిలో విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.