‘సాహో’ వంటి భారీ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘జాన్’. కే.రాధకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా స్క్రిప్ట్ సరిగా రాలేదని సినిమా ఆగిపోయిందని రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆ పుకార్లకు పుల్ స్టాప్ పెడుతూ సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ ను అభిమానులతో పంచుకోవడంతో పాటు తిరిగి సినిమా షూట్ మొదలైనట్లు తెలిపాడు. అలాగే ఈ సినిమా చాలా ఫన్ రైడ్ లా ఉంటుందని డిస్క్రిప్షన్ లో పెట్టాడు. కాగా ఈ సినిమా 1960 కాలం నాటి చారిత్రిక ప్రేమ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.