‘గీతా గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు పరుశురాం.. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా కొత్త సినిమాను ప్రకటించలేదు. తాజాగా ఆయన ప్రభాస్, నాగ చైతన్యలకు కథలను వినిపించడం జరిగిందట. పరుశురాం చెప్పిన కథ ప్రభాస్ కి బాగా నచ్చిందట. ఇక నాగ చైతన్యకు కూడా ఆయన చెప్పిన కథ నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ప్రస్తుతం నాగ చైతన్య ‘వెంకీ మామ’, శేఖర్ కమ్ముల సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘వెంకీ మామ’ సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత పరుశురాం సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.

ఇక ‘సాహో’ వంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్.. కే.రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా తీస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ప్రభాస్ తో సినిమా చేయడానికి కొంత మంది దర్శకులు ఇప్పటికే వేచి ఉన్నారు. మరి పరశురామ్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది త్వరలోనే తెలియనుంది.