‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో’ కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ కూడా మంచి హిట్ సాధించింది. కాగా ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా సందీపే దర్శకత్వం వహించాడు.

ఇక ప్రస్తుతం సందీప్ తెరకెక్కించే సినిమాపై అందరి ద్రుష్టి పడింది. ప్రభాస్ హీరోగా సందీప్ ఓ సినిమాను తీయబోతున్నాడట. ఈ సినిమా స్రిప్ట్ ను కూడా సందీప్ రెడీ చేసాడు. ఈ సినిమాకు ‘డెవిల్’ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారంగా ఉంది. డార్క్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను టి సిరీస్ సంస్థ నిర్మించనుందట. మరి త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •