ప్రభాస్ హీరోగా వచ్చిన ‘సాహో’ సినిమా ప్రేక్షుకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ‘పాన్ ఇండియా’ స్టార్ గా ప్రభాస్ తన సత్తా చాటి దాదాపుగా 230 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఒక్క హిందీలోనే ఇప్పటి వరకు 125 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రభాస్ స్టామినా తెలియచేసింది. ప్రభాస్ ‘సాహో’ సినిమా సమయంలోనే గోపీచంద్ హీరోగా ‘జిల్’ సినిమాకు దర్శకత్వం వహించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ అనే సినిమాను సెట్స్ మీదకు తీసుకొని వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా వచ్చే ఎడాది 2020 సమ్మర్ కు విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుపెడుతున్నారు. ఈ సినిమా ముగిసిన తరువాత ప్రభాస్ తన తదుపరి సినిమా పూరి జగన్నాధ్ దర్సకత్వంలో చేయాలని బావిస్తున్నాడట. ఇప్పటికే దీనిపై చర్చలు ముగిశాయని, ఈ చిత్రానికి కూడా ప్రభాస్ స్నేహితులు యువి క్రియేషన్స్ బ్యానేర్ పై నిర్మించనున్నారని తెలుస్తుంది.

ప్రభాస్ – పూర్తి జగన్నాధ్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ‘బుజ్జిగాడు, ఏక్ నిరంజన్’ రెండు సినిమాలు రూపొందాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా రానుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి ప్రభాస్ ‘జాన్’ సినిమాతో బిజీగా ఉంటే… పూరి జగన్నాధ్ త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం వీరిద్దరికి ఉన్న కమిట్మెంట్స్ పూర్తికాగానే సినిమా సెట్స్ మీదకు వెళుతుందట.

దానికి కాస్త టైమ్ పట్టేలా అవకాశాలు కనపడుతున్నాయి మూడేళ్ళుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న పూరి జగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో తో లైమ్ లైట్ లోకి రావడంతో వరుస సినిమాలు చేస్తూ మరోసారి బిజీ డైరెక్టర్ గా మారిపోయాడు. పూరి జగన్నాధ్.. ప్రభాస్ హీరోగా దర్శకత్వం వహించిన రెండు సినిమాలు మాస్ సినిమాలే కావడంతో మరోసారి ప్రభాస్ ను మాస్ హీరోగా చూపించే అవకాశాలు ఉన్నాయా అని అప్పుడే ఫిల్మ్ వర్గాలలో గుసగుసలు మొదలయ్యాయి.

  •  
  •  
  •  
  •  
  •  
  •