మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా ‘సైరా’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను రామ్ చరణ్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ స్థిరంగా ఉండగా ఓవర్సిస్లో, బాలీవుడ్ లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించిన తీరును విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి తీయబోయే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. మొన్న నితిన్ తో సినిమా తీస్తాడని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తో సురేందర్ రెడ్డి సినిమా కన్ఫర్మ్ అంటున్నారు. ప్రభాస్ కోసం సురేందర్ రెడ్డి ఓ అద్భుతమైన కథను తాయారు చేసాడట. ఆ కథ ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఫిలిం నగర్ సమాచారం.

ఇక భారీ అంచనాలతో వచ్చిన ‘సాహో’ సినిమా అందరిని నిరాశ పరిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా పర్వాలేదనిపించింది. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘జాన్’ అనే సినిమా చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అంటున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ‘సైరా’ సినిమా ప్రమోషన్ లలో ఉన్నాడు. సైరా మూవీ కి విడుదల తర్వాత కూడా భారీగా ప్రమోషన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో సురేందర్సం రెడ్డి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కావున మరో వారం రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన రానుందంట.