ప్రకాష్ కోవెలమూడి అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ కోవెలమూడి అంటే కాస్త గుర్తు పట్టే అవకాశం ఎక్కువే. ఎందుకంటే అతడు తెలుగులో రెండు సినిమాలకు దర్శకత్వం వహించినా ఆ రెండు ప్లాప్ టాక్ నే మూటకట్టుకున్నాయి. ఇక అతగాడు ముంబైకు చెందిన కనికా అనే స్క్రిప్ట్ రైటర్ పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న కొన్నేళ్ళకు వారి మధ్య దూరం పెరగడంతో పాటు ప్రకాష్ కోవెలముడిని వచ్చి ముంబైలో సెటిల్ అవ్వాలని కోరడం, అతడు మాత్రం హైదరాబాద్ వదిలి రాకపోవడం ఇలా అనేక చర్చల మధ్య గత ఏడాది ఇద్దరు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది.

అప్పటి నుంచి విడివిడిగా ఉంటున్న వారిద్దరూ ఇప్పుడు అతడి మాజీ భార్య కనికా మరొకరితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ పాపులర్ రైటర్ హిమాన్షు శర్మతో ప్రస్తుతం డేటింగ్ లో ఉంది. ఇద్దరి ఆలోచనలు బావాలు కలిస్తే త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారేమో. ఇక ప్రకాష్ కోవెలమూడి కూడా మరొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చినా, అతడితో హీరోయిన్ అనుష్కకు రిలేషన్ ఉందని, ఇద్దరు పెళ్లి చేసుకునే అవకాశముందని రూమర్లు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం అవి రూమర్లగానే ఉన్నాయి. ఇక కనికా ఇప్పుడు మరొకరితో చెట్టా పట్టాలేసుకొని తిరగడంతో ప్రకాష్ కోవెలమూడి కూడా త్వరలో తన సెకండ్ లైఫ్ స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.