ప్రముఖ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ నివాసంలో గురువారం ఆదాయపన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదగొన్నూరులోని ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ కమీషనర్ ఏం శ్వేత ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. ఇంకా ఇంట్లో ఉన్న రెండు బీరువాలు తెరవాల్సి ఉందని.. నారాయణ హైదరాబాద్ లో ఉన్నందున స్వగ్రామం చేరుకోగానే ఆ బీరువాలు తెరిచి సోదా చేస్తామన్నారు.

ఇక హైదరాబాద్, విజయవాడలో నారాయణ కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిపినట్లు సమాచారం. కాగా దుర్గా ఆర్ట్స్ పతాకంపై నారాయణ పలు విజయవంతమైన సినిమాలను నిర్మించారు.