ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్ పై మొదటి సినిమా నేనే తీస్తున్నానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పుకుంటూ, దానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. రామ్ గోపాల్ వర్మ సినిమా ఎలా ఉన్నా ట్రైలర్ మాత్రం, అదిరిపోతుంది. అలానే కరోనా ట్రైలర్ కూడా పిచ్చేక్కించింది. లాక్ డౌన్ పెట్టిన కొత్తలో కనుక ఆ ట్రైలర్ వస్తే, ఎవరు బయటకు వెళ్లడానికి సాహసించేవారు కాదు.

ఇక ఇప్పుడు కరోనా వైరస్ పై రెండవ సినిమా కూడా మన తెలుగు సినిమా నుంచే కావడం విశేషం. “ఆ” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి ఔరా అనిపించిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు కరోనా వైరస్ నేపధ్యపై సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను చైనాలో కరోనా పరిస్థితుల ఆధారంగా కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ ప్రకటించకముందే ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తి చేశామని, లాక్ డౌన్ ముగిసిన వెంటనే మిగతా షూటింగ్ చేసి సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ లుక్ రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తామని అన్నారు. డిఫరెంట్ గా సినిమాలు తీసే ప్రశాంత్ వర్మ “కరోనా వ్యాక్సిన్” సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

భూముల అమ్మకంపై టీటీడీ కీలక నిర్ణయం

చంద్రబాబు వైఖరి ఎలాంటిదో దేవినేని నెహ్రు ఎప్పుడో బయటపెట్టాడు.