“అ!” అనే ఒక విభిన్నమైన సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైనా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తన రెండో సినిమాగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజేశేఖర హీరోగా “కల్కి” అనే ఒక డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన “కల్కి” ట్రైలర్ చూస్తుంటే తన రెండో సినిమాతో కూడా మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు. “కల్కి” సినిమా ఈనెల 28వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది.

ప్రశాంత్ వర్మ “కల్కి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ కెరీర్ ఆరంభంలో ఎన్నో విభిన్న సినిమాలు చేసిన “బాలకృష్ణ” గారు అద్భుతమైన నటుడని, అయన అభిమానుల ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి విభిన్నమైన సినిమాలకు దూరంగా ఉంటున్నారని, బాలకృష్ణ గారు ఒప్పుకుంటే తన దగ్గర ఒక క్రేజీ స్టోరీ ఉందని, ఆ స్టోరీ బాలకృష్ణ గారికి సరిగ్గా సరిపోతుందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. 

ప్రశాంత్ వర్మ చెప్పినట్లు బాలకృష్ణ ఆ క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలకృష్ణ ఈ వయస్సులో క్రేజీ ప్రాజెక్ట్స్ చేసే సాహసం చేస్తాడా లేదా అనేది చూడాలి. బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతుంది. 
  •  
  •  
  •  
  •  
  •  
  •