ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలులో మూడవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 66 లక్షల మంది విద్యార్థులకు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు. ఇక లక్షన్నర మందికి ఉచితంగా కళ్లజోడులు ఇచ్చామని తెలిపారు. ఇక మార్చి1 నుండి అవ్వాతాతలకు కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని.. వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే అవ్వాతాతలకు కళ్లజోడులు పంపిణి చేస్తామని చెప్పారు.

అవసరమైన చోట కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తామని.. ఎల్లవేళలా పేదవాడికి వైద్యం అందించాలన్నారు. అసలు పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్ లేడన్న వ్యాఖ్య లేకుండా చేస్తామని చెప్పిన సీఎం.. 15337 కోట్లతో ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తామని అన్నారు. అలాగే నర్సింగ్ కళాశాలలు కూడా పెంచుతామని.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ ఉండేలా కృషి చేస్తామని సీఎం జగన్ అన్నారు.