మెగా హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న సినిమా ‘ప్రతి రోజూ పండగే’. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ వీడియోలో సాయి ధరమ్ తేజ్, సత్యరాజ్ ల మధ్య సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలో నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.