నిన్న ఢిల్లీ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడి చివరకు టైగా ముగిసి సూపర్ ఓవర్ లో ఢిల్లీ సూపర్ విక్టరీతో ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి విక్టరీ సొంత చేసుకుంది. కానీ ఈ మ్యాచ్ లో 19వ ఓవర్ లో ఫీల్డ్ ఎంపైర్ నితిన్ మీనన్ తీసుకున్న ఒక్క నిర్ణయం పంజాబ్ విజయాన్ని కట్టడి చేసిందని పంజాబ్ అభిమానులతో పాటు ప్రీతీ జింటా కూడా మండిపడుతుంది. మ్యాచ్ 18.3 బాల్ మాయంకా రెండు పరుగులు తీస్తే అతడు క్రీజ్ లో బ్యాట్ పెట్టలేదని ఒక్క పరుగుగా పరిగణించడంతో మ్యాచ్ ఓడిపోవడం జరిగిందని చెప్పుకొచ్చింది.

దీనిపై ప్రీతీ జింటా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తనకు కరోనా వైరస్ వస్తే విజయవంతంగా అధిగమించామని, దాదాపుగా ఐదు సార్లు కరోనా వైరస్ టెస్ట్ చేయించుకున్నానని తాను కరోనా వైరస్ వచ్చినందుకు బాధపడలేదని, కానీ ఇలా ఇంత టెక్నాలజీ ఉన్నాగాని వినియోగించుకోకుండా తప్పుడు నిర్ణయం తనను చాలా బాధపెట్టిందని, బీసీసీఐ కొత్త నిబంధనలను ప్రవేశ పెట్టవలసిన అవసరముందని, ఒక్క పరుగు తేడాతో తాము ఎంతటి పరిణామాలకు గురయ్యామో చూసారు కదా అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. చివరి మూడు బాల్స్ లో ఒక్క పరుగు చేయవలసిన సమయంలో చతికిలపడి సూపర్ ఓవర్ లో రెండు పరుగులకే వికెట్స్ కోల్పోవడం చూస్తుంటే నిన్న పంజాబ్ కు ఏ మాత్రం కలిసొచ్చినట్లు లేదు.