మహారాష్ట్రలోని ఓ కళాశాలలో ప్రేమికుల రోజున ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం విద్యార్థునులంతా కాలేజీకి రాగానే వారిచేత ప్రిన్సిపాల్ ప్రేమకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. ప్రేమ పెళ్లి చేసుకోకూడదంటూ ఆ విద్యార్థునుల చేత ఆ కళాశాల యాజమాన్యం ప్రమాణం చేయించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చుండూరు రైల్వే ప్రాంతంలోని మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో జరిగింది. నా తల్లిదండ్రులపై నాకు పూర్తి నమ్మకముంది. నేను ప్రేమలో పడను. ప్రేమ పెళ్లి చేసుకోను అని ఆ విద్యార్థునులు మరాఠీలో ప్రమాణం చేశారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •