మైనర్ నుంచి అప్పుడే మేజర్ గా మారిన యువతి తన బావను గాఢంగా ప్రేమించడంతో అతడినే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. కానీ అతడికిచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లి తండ్రులు ఒప్పుకోలేదు. వరుసకు బావ అయినా అతడంటే ఎందుకో వారి కుటుంబసభ్యులను మంచి అభిప్రాయం లేకపోవడంతో తాము చేసేది లేదని ఖరాకండిగా చెప్పారు. కానీ బతిమాలి బుజ్జగించి తాను ఘాడంగా ప్రేమించిన బావను ఇంట్లో కుటుంబసభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకుంది.

పెళ్ళైన కొన్నాళ్ళకు కాపురం పెట్టారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న సమయంలో సరిగ్గా ఆరు నెలలు గడవకుండానే ఆ యువతి ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఒక సూసైడ్ లెటర్ రాసింది. బావ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కానీ నీకు నాకన్నా చాలా మంది ముక్యమైనవారు ఉన్నారనుకుంటా? నేనంటే నీకు ఇష్టం లేదనుకుంటా. కానీ నువ్వంటే నాకు ఇష్టం బావా. లవ్ యు బావా నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా అని లెటర్ రాసి చనిపోవడం ఇప్పుడు అందరిని కలచి వేస్తుంది. ఆ యువతి చనిపోవడంతో ఆమె తండ్రి అత్తింటివారి వేధింపుల వలనే చనిపోయిందని, పెళ్ళైన తరువాత రెండు నెలలు మాత్రమే తన కూతురు ఆనందంగా అందని, అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారని కేసు పెట్టడంతో పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా కొల్చారంలో చోటుచేసుకుంది.