నారా రోహిత్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు. కానీ చంద్రబాబు నాయుడు తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడుతో అంత గొప్పగా మాటలు లేకపోయినా నారా లోకేష్… నారా రోహిత్ బాగుంటారని చెబుతుంటారు. మొదట్లో నారా రోహిత్ మంచి మంచి సినిమాలను ఎంచుకునే వాడు. అతడి సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్త విషయం ఉంటుందని ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించేవారు.

కానీ తరువాత కాలంలో నారా రోహిత్ ఎంచుకున్న సినిమాలన్నీ పల్టీ కొట్టడం మొదలు పెట్టాయి. అతడితో ఒక సమయంలో సినిమా నిర్మించడానికి ముందుకు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన సపోర్టర్స్ నారా రోహిత్ కు వెనక ఉండి సినిమాలను నిర్మించేవారు. కారణం అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేసి నారా రోహిత్ ను పైకి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నించారు. కానీ వీలు పడలేదు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో అతడు ఎన్నికలకు ముందు కుదుర్చుకున్న కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయట. అతడిని నమ్మి డబ్బులు పెట్టడానికి కూడా నిర్మాతలు వెనక్కు వెళుతున్నారట. నారా రోహిత్ నటించిన సినిమాలకు శాటిలైట్ తో పాటు, డిజిటల్ మార్కెట్ కూడా అంత గొప్పగా ఉండకపోవడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపున నారా రోహిత్ ఈ మధ్య మరింత లావుగా మారడంతో ప్రస్తుతానికి అతడు ఇండస్ట్రీకి బై బై చెప్పేసాడని అంటున్నారు.

ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే నారా రోహిత్ తన స్నేహితుడు శ్రీవిష్ణుని ఇండస్ట్రీకి తీసుకుకొని వచ్చి అతడికి సినిమాలో మంచి క్యారెక్టర్స్ వచ్చేలా చేసాడు. నారా రోహిత్ రోజు రోజుకి ప్రేక్షకాదరణ కోల్పోతున్న సమయంలో శ్రీవిష్ణు మంచి సినిమాలతో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరుచుకుంటున్నాడు. శ్రీవిష్ణు హీరోగా రేపు విడుదల కాబోతున్న “తిప్పరా మీసం” సినిమాపై కూడా ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సినిమాలు లేక ఇబ్బంది పడుతున్న నారా రోహిత్ వచ్చే ఏడాది ఏమైనా అతడు బరువు తగ్గించుకొని మంచి సినిమాలతో వస్తాడేమో చూడాలి.