సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం ఒక్కసారి ఆ ఊబిలోకి దిగిన తరువాత బయటకు రాలేదు. టేక్ 1… టేక్ 2… టేక్ 3… షాట్ ఒకే…. లైట్స్ ఆఫ్ ఇలా విని విని, బయటకు వెళితే వందల మంది అభిమానాలు… అంత సెల్ఫీల గోల… ఊపిరాడనియ్యరు. ఈ రంగుల ప్రపంచంలో నుంచి బయటకు రాలేక రోజుకు వేల రూపాయల మేకప్ ఖర్చులు ఇలా చెప్పుకుంటూ పోతే… నెలకు లక్షల రూపాయల ఖర్చు… సినిమాలు ఉండి అన్ని బాగానే ఉంటే పరిస్థితి కూడా బాగానే ఉంటుంది.

ఒక్క సారి సినిమా ఆఫర్లు తగ్గిపోయాయా… ఆర్ధిక ఒత్తిడి… వీకెండ్ పార్టీలు ఇలా అన్ని కనుమరుగవుతుంటే ఒకవైపున చేతిలో డబ్బులేక కష్టాలలో ఉన్న వారిని గుర్తించి మచ్చిక చేసుకొని వ్యభిచార కూపంలోకి దిగితే దండిగా డబ్బు సంపాదించవచ్చని వారి మెదడులో వారికి లేని చెడు అభిప్రాయాలను కలిగించేలా చేయడంలో సినిమా పరిశ్రమకు చెందిన కొంత మంది నిష్ణాతులు ఉంటారు.

ఒక్కసారి వ్యభిచార కూపంలోకి దిగిన తరువాత వచ్చే ఆదాయం చూసి వారు కొనసాగింపు చేస్తూ, కొన్ని రోజులకు బాధ పడటం.. వ్యభిచార కూపంలో నుంచి బయటకు రావాలని ప్రయత్నించినా బయటకు రాలేక పోవడం ఇవన్నీ సర్వసాధారణం. ఇలాంటివి గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాల జరిగాయి.

ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక బాలీవుడ్ నటిని (33)ను మభ్య పెట్టి వ్యభిచార కూపంలోకి దింపి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆమె కష్టాలలో ఉండటాన్ని వ్యభిచారం చేయించే షిపాంజలిరావు అనే మహిళ గమనించి నీ ఆర్ధిక కష్టాలు తీరాలంటే వ్యభిచారమే సరైన మార్గమని చెప్పి రొంపిలోకి దింపి విటులను పంపించి వారి దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి, అమ్మాయిలకు డబ్బులు తక్కువ ఇస్తూ దందా చేస్తుంది.

పోలీసులు ఆమెను పట్టుకోవడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే కొత్తగా వ్యభిచార రొంపిలోకి దిగిన నటీమణికి ఎరగా వేసి ఒక నకిలీ కస్టమర్ ను పంపించి ఆ బాలీవుడ్ నటితో గడపడానికి 20 వేలు ఇవ్వాలని కోరడం, అతడు 20 వేలు ఇచ్చి ఆమె దగ్గరకు వెళ్లడం వెంటనే పోలీసులు రంగంలోకి దిగి షిపాంజలితో పాటు ఆ బాలీవుడ్ నటిని కూడా అరెస్ట్ చేసారు.

ఈవిడ గతంలో కూడా ఎంతో మంది బాలీవుడ్ నటీమణులను ఈ రొంపిలోకి దింపినట్లు తెలుస్తుంది. ఆ బాలీవుడ్ మహిళను రక్షించి రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఇక షిపాంజలిరావు అనే మహిళ ద్వారా ఎంతమంది ఈ రొంపిలోకి దిగారో కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యాయరట.