పోలీసులు కొంతమంది బద్ధకంగా ఉద్యోగం చేసేవారుంటారు… మరికొంతమంది లంచం కోసం పనిచేసేవారుంటారు, మరికొందరైతే తమ పై అధికారులను సైతం లెక్కచేయకుండా అవినీతిని అరికడుతూ నిజాయితీగా ఉద్యోగం చేస్తారు. ఇలా నిజాయితీగా ఉద్యోగం చేసే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మన సొసైటీలో ప్రతి రోజు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒక నిజాయితీగల అధికారి తన విధులను నిర్వహించే భాగంలో మద్యం దొంగ రవాణా చేస్తున్నా వారిని పట్టుకునే దానిలో భాగంగా తన ప్రాణాలనే పణంగా పెట్టాడు.

ఏపీలో ఎక్కడ చూసిన ఇప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. దీనిపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా అక్రమార్కులు తప్పించుకుంటూనే ఉన్నారు. సీఎం జగన్ సొంత ఇలాఖాలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిని పసిగట్టి పులివెందుల ఎస్ఐ గోపినాధ్ రెడ్డి పట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక కారులో మద్యం సీసాలు ఉన్నాయని పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందటంతో అక్కడకు ఎస్ఐ గోపినాధ్ రెడ్డి వెళ్లగా అతడిని చూసి నిందితులు ఏ మాత్రం భయపడకుండా పోలీసులను భయపెట్టే దానిలో భాగంగా కారుని వేగంగా ముందుకు వెనక్కు పోనివ్వడం జరిగింది.

దీనితో ఎస్ఐ గోపినాధ్ రెడ్డి కారులో మద్యం ఎలాగైనా పట్టుకోవాలని తెలివిగా ముందు నుంచి వారి కారుని అడ్డగించే క్రమంలో ఎస్ఐ కారు పైకి దూకాడు. దీనితో వారు మరింత వేగంగా పోనిచ్చే క్రమంలో కారుని గట్టిగా పట్టుకొని కారు అద్దాలు పగలగొట్టి వారిని చాచక్యంగా ఎస్ఐ గోపినాధ్ రెడ్డి పట్టుకున్నాడు. కారు అద్దాలను పగలగొట్టినా వారు కారు వేగంగా తగ్గించకుండా ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మరొక పోలీస్ వ్యాన్ వచ్చి వారి కారుని అడ్డగించడంతో ఇక తప్పని పరిస్థితులలో కారుని వారు ఆపేయడం జరిగింది. ఈ ఛేజింగ్ అంతా దాదాపుగా రెండు కిలోమీటర్లు జరిగినట్లు తెలుస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకున్న కారులో 80 మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిపై కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకున్న ఎస్ఐ గోపినాధ్ రెడ్డికి అధికారు ప్రశంసలతో ముంచెత్తారు. సినిమాను తలపించేలా ఎస్ఐ చేజింగ్ దృశ్యం ఇప్పుడు పులివెందుల ప్రజల దృష్టిలో రియల్ హీరోగా మారిపోయాడు.

ఆరడుగులు కాదు, కనీసం 26 అడుగులు దూరం పాటించాలని ఆక్స్ ఫోర్డ్ సంచల వ్యాఖ్యలు

నూతన్ నాయుడు అంతటి ఘాతుకానికి పాల్పడ్డాడా?

పాపం ఆ టీడీపీ ఎమ్మెల్యేకు వైసీపీ నేత చుక్కలు చూపిస్తున్నాడట