కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప మాజీ ఎంపీ అభినాష్ రెడ్డి జమ్మలమడుగు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి సొంతూరు సున్నపురాళ్లపల్లెకు వెళ్లేందుకు అవినాష్‌ రెడ్డి ప్రయత్నించగా.. గొడవలు జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు… ఆయన్ను అడ్డుకున్నారు.

జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఇంచార్జ్‌ సుధీర్‌ రెడ్డిలు శనివారం ప్రచారానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం ఉందంటు పోలీసులు సుధీర్ రెడ్డి ని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అలాగే పులివెందులలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను కూడా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నిన్న వైసీపీ నేతల ప్రచారానికి అనుమతించిన పోలీసులు నేడు నిరాకరించటం గమనార్హం.