ఈ ఏడాది జులై 21న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్-3 100 రోజులకు పైగా జరిగి ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ షోలో రాహుల్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు రాహుల్. బిగ్ బాస్ తెలుగు సీజన్-3 లో తాను టైటిల్ గెలుస్తానని అనుకోలేదని అన్నాడు. ట్రోపి గెలవడం నన్ను భావోద్యోగానికి గురిచేసిందన్న రాహుల్.. నన్ను విజేతగా ప్రకటించినప్పుడు నా తల్లిద్రండ్రుల కళ్ళలోని పీలింగ్ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.

అలాగే నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని.. పునర్నమికి నాకు మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదన్నారు. నేను డేట్ కు పిలిచినప్పుడు కూడా ఆమె రానని చెప్పిందని.. ఆమె జీవితంలో మరొక వ్యక్తి ఉన్నారన్నారు. మీమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని.. పునర్నమి అంటే నాకు చాలా గౌరవం అన్నారు. గెలుచుకున్న 50 లక్షల ప్రైజ్ తో మా తల్లిదంత్రులకు మంచి ఫ్లాట్ కొనిస్తానని రాహుల్ ఈ సందర్భంగా తెలిపాడు.