బిగ్ బాస్ షో తర్వాత రాహుల్ సిప్లిగంజ్-పునర్నవికి అమాంతం క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ముందు పెద్దగా తెలియని వీరిద్దరూ ఆ షో తరువాత బిగ్ బాస్ పుణ్యమాని బాగా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ జోడి వీక్షకులను, నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఆ షో తర్వాత కూడా వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నారు.

తాజాగా రాహుల్ సిప్లిగంజ్.. పునర్నవిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించి.. చివర్లో మాత్రం ఝలక్ ఇచ్చాడు. పరిచయం లేని వ్యక్తిగా వచ్చి నిజమైన స్నేహితురాలిగా మారి బిగ్ బాస్ జర్నీలో నన్ను ప్రోత్సహించింది. తన తీపి జ్ఞాపకాలు ఎప్పుడు నా మనసులో ఉండిపోతాయన్నాడు రాహుల్. ఇక చివరిలో ఇంకా సాలు తీయ్.. మస్తయ్యింది.. ఇక సల్లవడు నవి.. అంటూ జులాక్ ఇచ్చారు.

దీనిపై స్పందించిన పునర్నవి.. నువ్వే సల్లవడు.. సల్లవడు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. దీనిపై స్పందించిన రాహుల్ నేనెప్పుడూ సల్లగానే ఉంటా అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక వీరిద్దరూ సంభాషణ వైరల్ గా మారింది.