కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని చోట్ల లాక్ డౌన్ లు ఉండటంతో పాటు బయటకు వస్తే కరోనా వైరస్ ఎక్కడ చుట్టేస్తుందో అన్న భయంతో జనం బయటకు రావడానికి హడలిపోతున్నారు. ఇక లక్షలలో ఉద్యోగాలు పోయి నిరాశ్రయుల వేదన మరింత బాధించేదిగా ఉంది. పరిస్థితులు ఇలా ఉంటే డబ్బెక్కువై ఏమి చేయాలో తెలియని పుణెకు చెందిన ఒక ధనవంతుడు ఏకంగా బంగారంతో మాస్క్ తయారుచేసించుకొని పెట్టుకు తిరుగుతున్నాడు. ఇక అతడికి ఊపిరాడటానికి బంగారపు మాస్క్ కు రంద్రాలు కూడా పెట్టించుకున్నాడు. దీని ఖరీదు అక్షరాలా 2.90 లక్షల రూపాయలట

అతడి తీరుపై ఇప్పుడు సర్వత్రా అందరూ విషయం వ్యక్తం చేస్తూ ఇలా డబ్బెక్కువైతే లేనివాడికి పెట్టి వాడిని ఆదుకోవచ్చు కదా అని బండ బూతులు సోషల్ మీడియాలో సాక్షిగా తిడుతున్నారు. దీనిపై జమ్మూ కాశ్మీర్ రాజకీయ నేత ఒమర్ అబ్దుల్లా కూడా అతడి ఫోటో పోస్ట్ చేస్తూ “జ్ఞానం కంటే డబ్బు ఎక్కువగా ఉంటే ఇలాంటి పనులే చేస్తారని చురకలంటిచారు”. ఇలా డబ్బెక్కువై ఏమి చేయాలో తోచక ఇలాంటిపనులు చేస్తుంటే దేశంలో ఎంతో మంది ప్రతిరోజు ఆకలి చావులతో చనిపోతున్నారు.