దర్శకుడు పూరి జగన్ తాను రాసుకునే ఏ కథ అయిన బ్యాంకాక్ బీచ్ ఒడ్డున పుట్టిందన్న సంగతి అందరకి తెలిసిందే. తాను కథ రాయాలన్న ప్రతిసారి బ్యాంకాక్ వెళ్ళిపోయి అక్కడ కథకు ఒక రూపం తీసుకొని రావడం ముందు నుంచి అతడికి అలవాటు. ఇక షూటింగ్స్ గట్రా కూడా అక్కడే చేస్తుంటారు. కానీ బ్యాంకాక్ ‘ఇస్మార్ట్ శంకర్” సినిమా మాత్రం బ్యాంకాక్ వెళ్లకుండా మొత్తం మన ఇండియాలోనే కానిచ్చేశారు. ఆ సినిమా హిట్ కావడంతో విజయ్ దేవరకొండతో తీస్తున్న “ఫైటర్” కూడా మన దేశంలోనే కానిచ్చేయాలని చూసారు.

ఇప్పటికే ముంబైలో 40 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక మిగతా భాగం షూటింగ్ చేయాలనుకున్న సమయంలో కరోనా వైరస్ రావడంతో షూటింగ్స్ నిలిచిపోగా ఇప్పుడు నిర్మాణానికి సిద్ధమవుతుంది. “ఫైటర్” సినిమాలో ఫైట్స్ విదీశీ ఫైటర్స్ తో నిర్మించవలసి ఉంది. ఈ షూటింగ్ పార్ట్ కూడా ముంబైలో జరగవలసి ఉంది. కానీ ముంబైలో కరోనా కేసులు ఎక్కువ వస్తుండటంతో ఇప్పుడు షూటింగ్ పార్ట్ ను బ్యాంకాక్ లో తీయాలని నిర్ణయించుకున్నారట. అక్కడ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నట్లు ఉంది. ఎట్టకేలకు “ఇస్మార్ట్ శంకర్” సినిమా హిట్ కావడంతో బ్యాంకాక్ వదిలివేయాలని భావించినా పూరి జగన్నాధ్ ను బ్యాంకాక్ వదిలేలా లేదు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. బాలీవుడ్ దర్శకుడు కరోనా జోహార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.