పూరి జగన్నాథ్ దర్శకత్వలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పూరి.. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ పూరి-విజయ్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ ఛార్మి ట్వీట్ చేసింది.

మరి ఈ సినిమా ఏ జోనర్లో తెరకెక్కనుంది, ఎవరెవరు నటీనటులు ఉంటారనేది త్వరలోనే ప్రకటిస్తామన్నది ఛార్మి. కాగా ఈ సినిమాను కూడా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరిజగన్నాథ్, ఛార్మి కలసి నిర్మిస్తారు. కాగా పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ సినిమా చేస్తుండటం వల్ల విజయ్ అభిమానులలో ఆసక్తి రేకెత్తిస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •