డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు పూరి. కట్ చేస్తే ఆయన దర్శకత్వంలో ‘జనగణమన’ సినిమా మరోసారి తెరమీదకు వచ్చింది.

మహేష్ తన 25 సినిమా ‘మహర్షి’ తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తాడనుకుంటే కొన్ని డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు పూరి.. మహేష్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు, ‘పోకిరి’, ‘బిసినెస్ మాన్’ సినిమాలు వీరి కాంబోలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇప్పుడు పూరి.. మహేష్ తో చేయబోయే సినిమాకు ‘జనగణమన’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం బాషలో తెరకెక్కేంచే ఆలోచనలో ఉన్నాడు పూరి. మరి ఈ మధ్యకాలంలో వరుస ప్లాప్ లతో ఉన్న పూరితో మహేష్ సినిమా చేస్తాడో లేదో వేచి చూడాలి.

janaganamana
  •  
  •  
  •  
  •  
  •  
  •