ఖమ్మం జిల్లా మమతా మెడికల్ కాలేజీ చైర్మన్ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ను మంత్రి పదవి వరించింది. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పువ్వాడ అజయ్ కుమార్ తరువాత పరిణామాలతో 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి తమ్ముల నాగేశ్వర రావుపై విజయం సాధించి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ తరువాత జరిగిన 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీలో చేరి మరో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావుపై విజయం సాధించారు.

ఖమ్మం జిల్లాలో ఉన్న ఇద్దరు సీనియర్ నేతలతో తలపడి విజయం సాధించడంతో పువ్వాడకు మంత్రి పదవి దక్కి ఉండవచ్చు. కానీ పువ్వాడకు మంత్రి పదవి రావడంపై బాల్క సుమన్ సరదాగా పువ్వాడ అజయ్ తో మాట్లాడుతూ కేటీఆర్ చెవులు కొరకడంతో మంత్రి పదవి సాధించారని ఛలోక్తి విసరడంతో దానికి పువ్వాడ బదులిస్తూ తనకు ‘కేకేకే’ కోటాలో మంత్రి పదవి వచ్చిందని అన్నారట. ఈ ‘కేకేకే’ గొడవ ఏమిటా అంటే “ఖమ్మం కేటీఆర్ కమ్మ” అని అర్ధమట.

ఈ మూడు కలసి రావడంతో వచ్చిందని చెప్పడంతో పాటు టీఆర్ఎస్ పార్టీలో మీరే స్టార్స్ మమ్మల్ని రానిస్తారా…అడ్డంగా నిలబడటమే కాకుండా కేటీఆర్ దగ్గరే 24 గంటలు ఉంటారని, అక్కడే ఉండి నువ్వు ఒక పదవి కొట్టేసావుగా అని పువ్వాడ కౌంటర్ ఇచ్చారట. పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా సీనియర్ సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు. మమతా మెడికల్ కాలేజీల తరుపున పలు సేవాకార్యక్రమాలు కూడా చేస్తుంటారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •