ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సినీనటుడు ఆర్ నారాయణ మూర్తి ప్రసంశలు కురిపించారు. ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందన్న ఆయన.. స్వాతంత్రం వచ్చాక ఎవరు చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కేవలం ఐదు నెలల కాలంలోనే 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు.

జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జగన్ ప్రయత్నించడం అభినందనీయం అన్నారు. రిజర్వేషన్ల కొరకు పార్లమెంట్ లో బిల్లు పెట్టినందుకు జగన్ కు అభినందనలు తెలిపిన నారాయణమూర్తి.. సామాజిక న్యాయం కోసం సీఎం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు.