ఏపీలోని రాయలసీమ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రస్తుతం కొంత మంది పేర్లు బయటకి వచ్చాయి. అనంతపురం – తలారి రంగయ్య, హిందూపురం – గోరంట్ల మాధవ్, నంద్యాల- పోచా బ్రహ్మానందరెడ్డి, కడప- వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట- మిథున్ రెడ్డి, తిరుపతి – మన్నెం మధుసూదన్ రావు, నెల్లూరు- మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు- మాగుంట శ్రీనివాసులు రెడ్డి లను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. చిత్తూర్, కర్నూల్ సీట్లకు మాత్రం అధికారికంగా పూర్తి సమాచారం లేదు. త్వరలోనే పూర్తిగా అభర్ధుల లిస్ట్ బయటకి రానుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •