తెలుగు ఫిల్మ్ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు ఒకప్పుడు దర్శకేంద్రుడుగా కీర్తించబడ్డాడు. ఆ తరువాత వయస్సు మీద పడటంతో పాటు పాత కథలను వండి వార్కి క్రమంలో అతడు పూర్తిగా వెనకపడిపోవడంతో పాటు ప్లాప్ లను కూడా బాగానే మూటకట్టుకున్నాడు. అలాంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు చాలా ఏళ్ళు తరువాత మరోసారి సినిమా తీయాలని ఉబలాటం కలిగింది. తనకు తీయడానికి ఎలాంటి కొత్త కథ దొరకకపోవడంతో 1996 లో శ్రీకాంత్ హీరోగా వచ్చి సూపర్ డూపర్ కొట్టిన “పెళ్లి సందడి” సినిమా పేరుతోనే ఇప్పుడు మరో సినిమాకు శ్రీకారం చుట్టారు.

“పెళ్లిసందడి” సినిమాను రీమేక్ చేస్తున్నారు, ఆ కథను కంటిన్యూ చేస్తూ కొత్తగా చెప్పబోతున్నారా అనేది ఇంకా తెలియరాలేదు. సినిమాలు ప్లాప్ ల బాట పట్టే సమయంలో ఇలా తమ సినిమాలను తామే రీమేక్ చేసుకోవడం గతం నుంచి వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన లోగో ఆవిష్కరణ కూడా జరిగిపోయింది. గతంలో “పెళ్లి సందడి సినిమాకు సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. కానీ హీరో హీరోయిన్ లు ఎవరు అనేది మాత్రం సస్పెన్సు గా ఉంచారు. దారుణమైన ప్లాప్ లలో ఉన్న రాఘవేంద్రరావుతో సినిమా తీయడానికి యంగ్ హీరోలైతే ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇంకా హీరో, హీరోయిన్ ఖాయం కాకపోవడంతోనే వారిని ప్రకటించలేదని తెలుస్తుంది.