చాల రోజుల తరువాత “ఎవరు” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెజీనా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రేడియో సిటీలో ప్రేక్షకులతో కలసి చిత్ర విశేషాలు పంచుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు సోదరులు ఎవరు లేరని, అందుకే మొదటి నుంచి రాఖీ పండుగ చేసుకోలేదని, తాను రాఖీ కడతానంటే నాచేత ఇప్పుడు ఎవరు కట్టించుకోవడం లేదని, అందరూ పారిపోతున్నారని రెజీనా వ్యాఖ్యానించారు.

ఆగస్ట్ 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజు అడవి శేషు, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో రానున్న “ఎవరు” సినిమాతో మరోసారి తాను గాడిలో పడి, ఇండస్ట్రీలో మరోసారి తన సత్తా చాటుతానని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. “ఎవరు” సినిమా ట్రయిలర్ కూడా ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా అడవి శేషు లాంటి హీరో ప్రతి సారి డిఫరెంట్ జోనర్ లో డిఫరెంట్ మూవీస్ ఎంచుకోవడంతో అతడిపై పూర్తి విశ్వాసం ప్రేక్షకులు కనపరుస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •