బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సదా సీదా వ్యక్తిగా పరిచయమైనా రాహుల్ సిప్లిగంజ్ చివరకు ఏకంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవడం అతడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అన్ని రోజులు మరొక కంటెస్టెంట్ పునర్నవితో అతడు ఏదో నడుపుతున్నాడని, వారిద్దరి మధ్యలో తెలియని ప్రేమ దాగి ఉందని అనేకమైన కథలు బయట వినిపించాయి. దీనికి సంబంధించి వీరిద్దరి నిజంగా ప్రేమించుకున్నారా, వీరిద్దరి మధ్య ప్రేమ రక్తి కట్టేలా బిగ్ బాస్ ప్రయత్నాలు చేశాడా అన్నది బిగ్ బాస్ యాజమాన్యానికి తెలియాలి. లేకపోతే వారిద్దరూ బయటకు వచ్చి చెప్పాలి.

వీరిద్దరూ ప్రేమ గురించి రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్ మాట్లాడుతూ నిజంగా వారిద్దరి మధ్య ప్రేమ ఉంటే తాము పునర్నవిని ఇచ్చి రాహుల్ కు పెళ్లి చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు. కానీ వారి మధ్య ప్రేమ ఉందని తాము అనుకోవడం లేదని, అదంతా బిగ్ బాస్ అలా క్రియేట్ చేసాడేమో అనుకుంటున్నామని, ఒకవేళ నిజంగా వారి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలాంటి ఇబ్బంది తమకు లేదని అన్నారు. వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ త్వరలో తెలుస్తుందని అన్నారు. ఇక బిగ్ బాస్ టైటిల్ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్ పునర్నవికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకలో వితిక, వరుణ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.