బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 తర్వాత రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు ఏ పని చేసిన ట్రెండీగా మారుతుంది. తాజాగా రాహుల్.. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాహుల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

ఇక ఈ సినిమా టీమ్ అందరికి ప్రకాష్ రాజ్ ఓ పార్టీ ఏర్పాటు చేసాడు. ఆ పార్టీ వేడుకలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణలతో పాటు రాహుల్, పునర్నవి కూడా పాల్గొన్నారు. పార్టీలో భాగంగా రాహుల్ ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో ‘ఏమై పోయావే నీవెంటే నేనుంటే’ అనే సాంగ్ ను పాడాడు. అంతే కాకుండా పునర్నవితో కలసి డాన్స్ కూడా వేసాడు రాహుల్.

దీనికి సంబంధించిన పోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు రాహుల్. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి. ఇక మంచి పార్టీ ఇచ్చిన ప్రకాష్ రాజ్ సార్ కి ధన్యవాదాలు అని తెలిపాడు రాహుల్.