చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధకు సంబంధించి నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఫంక్షన్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అభిమానులు ఎల్బీ స్టేడియంకు చేరుకుంటున్నారు. మరోవైపున హైదరాబాద్ మొత్తం కారుమబ్బులు కమ్మేయడంతో ఆడియో ఫంక్షన్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందా అనిపిస్తుంది.

గత వారమే ‘సైరా’ ఆడియో ఫంక్షన్ జరగవలసి ఉండగా, వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఈరోజుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు. కానీ ఈరోజు కూడా ఇలా వర్షం అడ్డంకిగా మారనుంది. ఈ సినిమా కోసం అతిరథ మహారధులు విచ్చేయనున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ రావలసి ఉండగా అతడికి ఆరోగ్యం సరిగ్గా లేక ఆడియో ఫంక్షన్ కు రావడం లేదు. ఇక తమిళ యాక్టర్ మోహన్ లాల్ కూడా చివరి నిమిషంలో డ్రాప్ అయినట్లు తెలుస్తుంది.

ఇక నయనతార గురించి చెప్పేదేముంది, సినిమా షూటింగ్ కు వస్తుందే తప్ప… ఇలాంటి ఆడియో ఫంక్షన్ గట్రా అంటే బహు దూరంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 270 కోట్ల రూపాయల బారీ ఖర్చు పెట్టి ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’పై నిర్మించారు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమాలో మొదటి పాటను ఈరోజు సాయంత్రం 9 గంటలకు లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేయనున్నారు.