రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే అమరావతి ప్రాంతంలోనూ కుండపోత వర్షం కురుస్తుంది. దీనితో అక్కడ ఏపీ హైకోర్ట్ లోకి వర్షపు నీరు చేరినట్లు సమాచారం. అక్కడ భారీ వర్షంతో హైకోర్టులోకి నీరు వచ్చి చేరింది. అంతే కాకుండా పలు ఛాంబర్లలో సీలింగ్ నుండి వర్షపు నీరు కారుతుంది. దీనితో హైకోర్ట్ ఆవరణంలోకి వచ్చిన వర్షపు నీరుని అక్కడ సిబ్బంది తోడి బయటకి పోస్తున్నారు.

ఇక గతంలో కూడా పడిన భారీ వర్షానికి ఏపీ సచివాలయంలోకి నీరు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు భారీ వర్షాలకు మంత్రుల ఛాంబర్లలోని సీలింగ్ ఊడిపడి ఏసీలలోకి వర్షపు నీరు చేరింది. తాజాగా వచ్చిన వర్షపు నీటితో హైకోర్ట్ భవన నిర్మాణ కంపినీ డొల్లతనం మరోసారి బయట పడింది.