రాజ్ తరుణ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘ఒరేయ్ బుజ్జిగా’ అనే ఆసక్తికర టైటిల్ ఖరారు చేశారు. కాగా గతంలో కొండా విజయ్ కుమార్ కు నితిన్ హీరోగా వచ్చిన’ గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమా మంచి పేరు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి వాణి విశ్వనాధ్, నరేష్, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 10నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •