దర్శకుడు రాజమోళి రామాయణంను తెరకెక్కిస్తే చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారట. దానికి తోడు ‘మెక్ రామాయన్’ అనే హాష్ టాగ్ ఇటీవల ట్విట్టర్లో ట్రేండింగ్ గా మారిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘మహాభారతం’ తన కలల సినిమా అని తెలియచేసారు. మహాభారతం పనులు మొదలు పెట్టాలని అయితే దానికి కొంచం టైం పడుతుందన్నారు. ఇప్పుడు సమయం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు దానిమీద కూర్చుని పని చేద్దామనే ప్రాజెక్టు కాదని.. దాని కోసం చాలా శక్తీ సామర్ధ్యాలు పెంపొందించుకోవాలన్నారు. పూర్తిగా దానిపైనే ద్రుష్టి పెట్టాలన్న రాజమౌళి అప్పుడు కానీ దాన్ని మొదలు పెట్టలేం అన్నారు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ‘RRR’. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం బీమ్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన అలియా బట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఇక 10 భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2021 జనవరి 8న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాను డీవీవీ ప్రొడక్షన్స్ పతాకంపై దానయ్య 400 కోట్ల బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

గుడ్ న్యూస్.. కరోనాను అడ్డుకునే యాంటీబాడీ గుర్తింపు..!

వైరస్ కన్నా అది చాలా ప్రమాదకరమంటున్న విరాట్ కోహ్లీ

చైనాలో షాకింగ్ ఘటన.. ఓ యువతికి తరుచుగా తలనొప్పి రావడంతో..!

మందు బాబుల దెబ్బకు ఏపీ బతుకు చిత్రం మారిపోయేలా ఉంది