ప్రభాస్ హీరోగా వచ్చిన “సాహూ” సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఇండియన్ ఫిలిమ్స్ లో సూపర్ యాక్షన్ ట్రైలర్ గా అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుకుంటుంది. ఇక బాలీవుడ్ లో అయితే సరికొత్త సంచలనల్తో ట్రైలర్ మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతుంది. 

“సాహూ” సినిమాకు సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి అందరూ ట్వీట్స్ చేస్తున్నా… రాజమౌళి మాత్రం ట్రైలర్ గురించి ఇంత వరకు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజమౌళి తనకు వెల్ విషర్స్ ఎవరైతే అనుకున్నాడో వాళ్ళ సినిమాలకు కచితంగా రియాక్ట్ అవడంతో పాటు… మరికొంత సినిమాపై బూస్టింగ్ తీసుకు రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ బాహుబలి లాంటి సినిమా చేసి ప్రభాస్ తో దాదాపుగా నాలుగు ఏళ్ళ పాటు ట్రావెల్ చేసి… ప్రభాస్ నా డార్లింగ్ అని చెప్పే రాజమౌళినే ఇలా ట్వీట్ చేయకపోవడంతో… రాజమౌళి ఏమైనా తన బాహుబలి సినిమాను బీట్ చేసే సినిమాగా “సాహూ”” ఉంటుందని లెక్కలేసుకొని ఫీల్ అవుతున్నాడా లేక మరేదైనా కారణంతో ట్వీట్ చేయలేదా అన్న చర్చకు దారితీస్తుంది.  

  •  
  •  
  •  
  •  
  •  
  •