రాజమౌళి తన సినిమాకు సంబంధించిన ఒక్క విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడతాడు. షూటింగ్ సమయంలో మొబైల్ కూడా సెట్ లోకి అనుమతించదు. ఫుల్ సెక్యూరిటీ మధ్య షూటింగ్ జరుగుతుంది. సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు కూడా రాజమౌళి పెద్దగా మీడియాకు కనపడకుండా తన సినిమా మీద ఫుల్ ఫోకస్ పెడతాడు. అంత డెడికేషన్ తో సినిమాని నిర్మిస్తాడు కాబట్టే ఇంతవరకు ఒక్క ప్లాప్ కూడా రాలేదు.

ఇక రాజమౌళి సినిమాల గురించి రోజుకొక న్యూస్ బయటకు వస్తూ మీడియా సర్కిల్ లో ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కోసం 25 కోట్లు, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కోసం 15 కోట్లు ఖర్చు చేస్తున్నారని గాసిప్ బయటకు వచ్చాయి. దీనిపై చిత్ర బృందం ఎలాంటి స్పందన తెలియచేయకపోయినా ఫిలిం సర్కిల్ లో మాత్రం హడావిడి చేస్తూనే ఉంటాయి. 

రాజమౌళి బృందం కూడా వీటి మీద అంత సీరియస్ గా ఆలోచించరు. ఈ గాసిప్స్ సినిమాకు మేలు చేసేయే తప్ప కీడు చేసేవి కాదని అలా చిత్ర బృందం గాసిప్స్ ఎంజాయ్ చేస్తూ వాళ్ళ పని వారు చేసుకుంటూ ఉంటారు. రాజమౌళి తన సినిమా గురించి మాట్లాడిన రోజే అది నిజమని… మిగతావన్ని సినిమా సెట్ లో పగడ్బందీగా హైసెక్యూరిటీ మధ్య నిర్మాణం జరగడంతో లేనిపోని గాసిప్స్ తో హడావిడి తప్ప ఏమి ఉండదని రాజమౌళి చిత్రబృందాన్ని దగ్గరగా చూసినవారు చెప్పే మాటలు.  


Tags: rajamouli, RRR


  •  
  •  
  •  
  •  
  •  
  •