రాజశేఖర్ తన ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారిని హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నారు. అందులో పెద్ద కూతురు శివాని బాలీవుడ్ సినిమా రీమేక్ తెలుగులో “2 స్టేట్స్”తో ప్రేక్షకుల ముందు రావాలని అనుకుంది. ఈ సినిమా హీరోగా చేస్తున్న అడవి శేషుకి, మరియు డైరెక్టర్ మధ్య ఏవో గొడవలు రావడంతో సినిమా ప్రస్తుతానికి సినిమా పక్కన పడేశారని వినికిడి. 

ఇక రెండవ కూతురు శివాత్మిక నటించిన “దొరసాని” ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. శివానిని మొదటగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటే…. సినిమా ఆగిపోవడంతో శివాత్మిక ఇప్పుడు మంచి సినిమాతో ప్రజల ముందుకు వస్తూ ఇప్పటికే లుక్స్ పరంగా మంచి పాజిటివ్ రిపోర్ట్స్ అందుకుంటుంది. రాజశేఖర్ తన పెద్ద కూతురు శివాని కూడా సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయితే బాగుండేదని, మొదటి సినిమాతోనే ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని కొంత కలత చెందుతున్నాడట. 
  •  
  •  
  •  
  •  
  •  
  •