సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘దర్భార్’ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. మురుగుదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తరువాత రజనీకాంత్.. తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనా, కుష్బూ, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

ఇక రజనీకాంత్ 168వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళంలో ‘అన్నాతే’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ‘అన్నయ్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తారట. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •