నర్సాపురం వైసీపీ పార్టీ నుంచి గెలుపొందిన రఘురామ కృష్ణం రాజు గత కొద్ది రోజులుగా తోక జాడిస్తూ వైసీపీ అధినాయకత్వానికి కంటిలో నలుసుగా తయారయ్యారు. అతడి చేష్టలు చూసి విసుగు చెందిన వైసీపీ ఎంపీలు అతడిని వెంటనే పార్లమెంట్ సభ్యత్వం నుంచి తొలగించాలని పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లాను కోరడం జరిగింది. దీనిపై అతి త్వరలో ఒక నిర్ణయం కూడా వస్తుందని తెలుస్తుంది. దీనితో అసహనాన్ని తట్టుకోలేని రాజు గారు తాను పులివెందులలో పది వేల మందితో సభ నిర్వహించే సత్తా ఉందని, కరోనా వైరస్ అయిపోయిన తరువాత తాను పులివెందులలో సభ పెట్టి తన సత్తా చూపిస్తానని, తనకు అక్కడ అభిమానులున్నారని చెప్పుకొచ్చారు.

రఘురామ కృష్ణం రాజు ఉత్సాహం చూస్తుంటే త్వరలో కొత్త పార్టీ పెట్టి వచ్చే ఎన్నికలలో తానే సీఎం అని అన్ని స్థానాలు తనకే వస్తాయని కేఏ పాల్ లా కామెడీలు చేసినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. ఇప్పటికే అతగాడు తాను పెద్ద అందగాడినని చెప్పుకొని మురిసిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇక దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ జోకులు పేల్చుతూ, అవునవును ఒక ఊరికి జోకర్ వస్తుంటే అతడిని చూడటానికి వేల మంది జనం పోగై అతడి చేష్టలను చూసి హాయిగా నవ్వుకుంటారని అంటున్నారు.

నిజంగా అతడికి అంత దమ్ము ఉంటే గత నర్సాపురం పార్లమెంట్ ఎన్నికలలో నీ సొంత గ్రామంలో నీకు మెజారిటీ తెచ్చుకోలేకపోయావని అసలు నీకు నీ సొంత గ్రామం వెళితే పట్టుపని పది మంది నీ వెనుక నిలబడి నీకు అండగా ఉండే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇక వైసీపీ మరొక ఎంపీ నందిగామ సురేష్ అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అతడి కుటుంబసభ్యులు చెప్పిన దాని ప్రకారం బాత్రూమ్ లో జారిపడటంతో అతడి చిన్నమెదడు చితికిందని త్వరలో అతడిని హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చడం మంచిదని ఘాటుగా స్పందించారు.