బెల్లంకొండ శ్రీనివాస్ ఎన్ని ప్లాప్ సినిమాలు వచ్చినా పట్టు విడవకుండా టాలీవుడ్ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఎప్పటికైనా హిట్ రాకపోతుందా అన్న కసితో సినిమాలు చేస్తున్న బెల్లంకొండకు “రాక్షసుడు” రూపంలో మంచి హిట్ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా కాదు.  థ్రిల్లర్ తో కూడుకున్న ఈ సినిమా కాస్త భయపెడుతుంది. అందువల్ల ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఇంట్రెస్ట్ చూపించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి హిట్ రావడంతో బెల్లంకొండ ఫ్యామిలీతో పాటు… దర్శకుడు రమేష్ వర్మ కూడా ఆనందం వ్యక్తం చేసారు.

ఇంతలా ప్రేక్షకులను మెచ్చినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కష్టమని తెలుస్తుంది దాదాపుగా 16 కోట్ల రూపాయలు అటు ఇటుగా ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ అమ్మారట. మొదటి వారంలో దాదాపుగా 9.5 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టింది. ఇక గత వారం విడుదలైన “మన్మధుడు-2” ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా బయ్యర్లు ఊపిరి పీల్చుకున్నారు. రెండవ వారంలో ఈ సినిమా దాదాపుగా నాలుగు కోట్ల వరకు సాధించే అవకాశం ఉందని లెక్కలేసుకుంటున్నారు. ఆగస్ట్ 15న మరో రెండు సినిమాలు శర్వానంద్ “రణరంగం”, అడవి శేషు “ఎవరు” సినిమాలు రావడంతో సినిమా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోయినా బయ్యర్లు 1 లేదా 2 కోట్ల రూపాయలు లాస్ లతో బయటపడవచ్చని లెక్కలేసుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •