యంగ్ అండ్ క్యూట్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అన్ని వర్గాల వారు అతడికి సోషల్ మీడియాలో విషెష్ చెప్పడం జరుగుతుంది. ఇక అభిమానులు కూడా ట్విట్టర్ ద్వారా ఎలాంటి హంగామా చేయకుండా విషెష్ చెబుతూ, నితిన్ ఇప్పటికే చెప్పినట్లు బుద్ధిగా లాక్ డౌన్ లో ఉంటూ నితిన్ కు సంబంధించిన పోస్టులు పెట్టుకుంటున్నారు.

నితిన్ పుట్టిన రోజు సందర్భంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రానున్న “రంగ్ దే” సినేమా మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈరోజు మరొక న్యూస్ నితిన్ గురించి బయటకు రావడం జరిగింది. నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానేర్ లో ఒక సినిమా రానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు వార్తలు రావడంతో అభిమానులంతా ఎందుకు బాసు ఫేట్ అవుట్ అయిన హీరోయిన్లతో కాకుండా ప్రెష్ గా కొత్త హీరోయిన్స్ తో చేసి నీ క్యూట్ లుక్స్ ను కాపాడుకోమని సలహా ఇస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ గత మూడు సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీలో ముంచాయి హావ నడిపి ఇప్పుడు సినిమాలు లేక తమిళ, మలయా చిత్రాలలో ప్రయత్నాల కోసం ప్రయత్నిస్తుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తుంటే, వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు నితిన్ రకుల్ కు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఫేట్ అవుట్ అయిన హీరోయిన్ కన్నా ఫ్రెష్ హీరోయిన్ తో చేస్తే సినిమా మరింత ఫ్రెష్ గా ఉంటుందని సలహా ఇస్తున్నారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా డబ్బులు పెట్టింది ఒకరు… నటించేది ఇంకొకరు… మధ్యలో నీ సలహాలు పాటించేది ఎవరు.