రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాస్త సినిమాలు తగ్గినా మరోసారి దూకుడు పెంచినట్లు కనపడుతుంది. నాగార్జున అక్కినేని హీరోగా వచ్చే వారం 9వ తారీఖున మన్మధుడు-2 సినిమా విడుదల కానుంది. ఇక ఆ సినిమాను విడుదలకు ముందే రకుల్ తమిళ్, హిందీ, తెలుగు బాషలలో నిర్మించనున్న ఇండియన్ – 2 కూడా నటించనున్నట్లు తెలుస్తుంది. 

ఇక ఇండియన్ – 2 లో రకుల్ ప్రీత్ సింగ్ కన్ఫర్మ్ అవ్వడంతో పాటు తన అభిమానులకు బిగ్ బాస్ 3 హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఫిదా చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక వచ్చే వారం విడుదల కాబోతున్న మన్మధుడు – 2 ప్రమోషన్స్ కోసం రకుల్ బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా వచ్చి కాసేపు కబుర్లు చెప్పి వెళ్తుందట. మన్మధుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ కు ఎంట్రీ ఇవ్వనుంది. 

మన్మధుడు – 2 హీరో కూడా బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున అక్కినేని కావడంతో వారిద్దరి అల్లరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతుందో అని ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే రకుల్ కూడా మన్మధుడు – 2 సినిమా తరువాత తాను తిరిగి లైమ్ లైట్  లోకి వస్తానని, తెలుగు ప్రేక్షకులను అలరిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఇక మన్మధుడు – 2 సినిమాలో నాగార్జునతో రొమాంటిక్ సీన్స్ తో పాటు హాట్ లిప్ కిస్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదైతేనేమి స్పైడర్ సినిమాతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిన రకుల్ మన్మధుడు – 2 తో తన అభిమానులను అలరించనుంది. 
  •  
  •  
  •  
  •  
  •  
  •