అక్కినేని నాగచైతన్య వరుస సినిమా హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. ఇక రామ్ చరణ్ బాటలోనే నాగ చైతన్య కూడా నడవబోతున్నాడట. ఇక చైతు కూడా సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను మొదలపెట్టబోతున్నాడట.

ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, నితిన్ వంటి హీరోలు సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక చైతు కూడా సొంతగా ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి కొత్త టాలంట్, కొత్త కాన్సెప్ఫ్ట్ చిత్రాలను వెలికి తీయాలనుకుంటున్నాడట. ఇక అంతే కాకుండా తండ్రి నాగార్జునతో కూడా సినిమాలు నిర్మిస్తానని అంటున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ నటిస్తూనే కొణిదల ప్రొడక్షన్స్ స్థాపించి చిరంజీవితో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జునకి సొంతంగా ప్రొడక్షన్ ఉన్నపటికీ కొత్త ప్రొడక్షన్ స్థాపించి సినిమాలు నిర్మించాలని ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన కూడా చేయబోతున్నాడు చైతు.

  •  
  •  
  •  
  •  
  •  
  •