రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న “సైరా నరసింహారెడ్డి” సినిమా అక్టోబర్ 2వ తారీకు విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రేపు అంటే ఆగస్ట్ 20న సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు దాదాపుగా అన్ని ఖర్చులు కలుపుకొని 270 కోట్లు అయ్యిందట. ఇందులో చిరంజీవి రెమ్యూనరేషన్ లేదట.

అంటే చిరంజీవి రెమ్యూనరేషన్ లేకుండానే అంత ఖర్చు చేశారా.. అంత ఖర్చు చేసిన ఈ సినిమాలో ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ చూపిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన డీల్స్ అన్ని ఏరియాలలో కొనసాగుతున్నాయి. నాలుగు బాషలలో విడుదలవబోతున్న ఈ సినిమా 270 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతుందా అంటే కాస్త ఆలోచించవలసిన విషయమే. ఈ సినిమా జస్ట్ బ్రేక్ ఈవెన్ అయినా చాలని నిర్మాత రామ్ చరణ్ బావిస్తున్నాడట.

ఈ లెక్కన చిరంజీవి ఈ సినిమాను ఫ్రీగా ఫ్యామిలీ ఖాతాలో చేసి పెట్టినట్లు అనుకోవచ్చు. చిరంజీవికి దాదాపుగా 25 కోట్ల రూపాయల వరకు ముట్టచెప్పాలి. ఆ లెక్కలన్నీ పక్కన పెట్టి సినిమాను చాల ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి డాడీకి గిఫ్ట్ గా ఇవ్వాలన్నదే కోరికట. అంత ఖర్చు పెట్టి నిర్మించిన సినిమాలో ఎలాంటి వండర్స్ ఉన్నాయో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే నెల రోజుల వ్యవధిలో తెలుగులో నిర్మించిన 300 కోట్ల రూపాయల సినిమాలు రెండు రానున్నాయన్నమాట. ఇక రెండు సినిమాలలో ఏ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో అలరిస్తుందో అని అప్పుడే చర్చకు దారితీసింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •