మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152 వ సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. గత కొంత కాలంగా ‘ఆచార్య’లో రామ్ చరణ్ నటిస్తున్నాడన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చరణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో తాను నటిస్తున్నానని అధికారకంగా తెలియచేసాడు. నేను నాన్న కలిసి తెరపై పూర్తి స్థాయిలో నటించాలని అమ్మ కల. ‘ఆచార్య’లో మా కాంబినేషన్ అలరిస్తుందని అనుకుంటున్నాను.

ఇక 2015లో నేను నటించిన ‘బ్రూస్ లి’ సినిమాలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. అలాగే ‘ఖైదీ నెంబర్ 150’లో నాన్నతో కలిసి డాన్స్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ‘ఆచార్య’లో నటించడం ఆనందంగా ఉందన్నారు చరణ్. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన ఆచార్య.. 2021 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

టిక్ టాక్ ప్రియులకు ఊరట.. యూట్యూబ్ షార్ట్స్ వచ్చేసింది..!

రమ్యకృష్ణ 50వ పుట్టినరోజు సెలెబ్రేషన్స్..!

చిరంజీవి గుండు వెనకున్న అసలు రహస్యం బయటపడింది..!

నేను చనిపోయాననుకున్నారు.. బిగ్ బాస్ కంటెస్టెంట్..!