దర్శకుడు రాజమౌళి.. రామ్ చరణ్ కు లైన్ క్లియర్ చేసాడట. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ‘RRR’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. అయితే సినిమా షూటింగులకు ప్రభుత్వం నిభంధనలతో కూడిన సడలింపు ఇచ్చిన నేపథ్యంలో షూటింగ్ ను స్టార్ట్ చేయాలనీ రాజమౌళి భావించాడు. కానీ కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో షూటింగ్ నిర్వహించడం మంచిది కాదనుకున్న రాజమౌళి.. షూటింగ్ ను వాయిదా వేసాడట. అంతేకాదు ఈ చిత్రాన్ని వచ్చే యేడాది దసరాకు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ‘RRR’ సినిమా వాయిదా పడడంతో రామ్ చరణ్.. ‘ఆచార్య’లో నటించడానికి లైన్ క్లియర్ అయిందంటున్నారు.

‘RRR’ షూటింగ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ‘ఆచార్య’ లో రామ్ చరణ్ చేయడం కుదడదని మరో హీరోను తీసుకోవాలని కొరటాల భావించారు. కానీ ఇప్పడు ‘RRR’ వాయిదా పడడంతో రామ్ చరణ్ ‘ఆచార్య’లో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ అత్యంత కీలకం అని చెబుతున్నారు. అందులో వచ్చే ఓ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కథను మలుపు తిప్పుతుందట. ఈ పాత్రకు రామ్ చరణ్ అయితేనే భాగుతుందన్న ఉద్దెశంతో మెగాస్టార్ ఉన్నారని తెలుస్తుంది. ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో ఎవరైనా నిత్య మీనన్ ను హార్ట్ చేశారా?

మహేష్ బాబు దూకుడుకి సాటెవ్వరు.!